09-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జనవరి 8 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.ఇటీవల జరిగిన తెలుగు సినీ అండ్ టీవీ అవుట్ డోర్ టెక్నీషియన్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. నూతన కార్యవర్గం ప్రమా ణ స్వీకారాన్ని మధురానగర్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నతన అధ్యక్షుడు కిశోర్ బాబు, కార్యదర్శి మహేశ్, కోశా ధికా రి సిసి రాజు, ఇతర కార్యవర్గ సభ్యులు, నాయకులు వల్లభనేని అనిల్, అమ్మిరాజు, శ్రీకాంత్, నాగార్జున రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.