calender_icon.png 15 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు శ్రేయస్సే సహకార సంఘాల ధ్యేయం

15-11-2025 12:33:19 AM

ఎన్ డీసీసీబీ చైర్మన్, మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు,నవంబర్ 14 (విజయక్రాంతి): రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని ఎన్ డిసీసీబీ చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ ఆవరణలో శుక్రవారం 72వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.

1923లో సహకార సంఘాలను నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. నాటి సహకార సంఘాల స్ఫూర్తి నేటికీ కొనసాగుతున్నదని వెల్లడించారు. మునుగోడు సొసైటీ పరిధిలోని రైతులందరికీ సేవలు అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు దుబ్బ గోపాల్ , సింగం వెంకన్న, కుతాటి బిక్షమయ్య ,పెరమళ్ళ కృష్ణమ్మ, మేకల మల్లయ్య, మాదరబోయిన యాదయ్య, మార్తా మోహన్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు ,మాజీ గ్రామ కో ఆప్షన్ సభ్యుడు పాలకూరి నరసింహ ,సెక్రటరీ పాలకూరి సుఖేందర్ సిబ్బంది అశోక్ రెడ్డి, పురుషోత్తం, స్వామినాథ్, లింగస్వామి, చంద్రశేఖర్, రైతులు ఉన్నారు.