12-09-2025 01:34:41 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా సగటున 15 శాతం జంటలు సంతానలేమితో బాధపడుతున్నారని, ఐవీఎఫ్ చికిత్సతో దంపతులు పిల్లలు కనే అవకాశం ఉందని -డాక్టర్ పద్మజా దివాకర్, ప్రముఖ గైనకాలజి స్టు, పద్మజ సంతాన సాఫల్య కేంద్రం హైదరాబాద్ తెలిపారు. సంతానలేమి సమస్యల గురించి ఆమె మాట్లాడుతూ.. “సంతానలేమిని ఇన్ఫెర్టిలిటీ అంటారు.
సంతానలేమి సమస్య దంపతులిద్దరిలోనూ ఉంటుంది. సంతానలేమికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి, పొగాకు, మద్యం, అధిక బరువు, తక్కువ బరువు, అనారోగ్యకర జీవన శైలి. మగవారిలో లోపాలు తెలుసుకునేందుకు వీర్య పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. సమస్య ఉంటే పరీక్షలు జరిపి చికిత్స తీసుకోవాలి. స్త్రీలలో అండం విడుదలలో సమస్య కూడా ఉండొచ్చు. ప్రస్తుతం మహిళలు 30 ఏళ్లు, మగవారు 35 ఏళ్లు నిండాక పెళ్లి చేసుకుంటున్నారు.
వయసు ఎక్కువగా ఉండి పెళ్లి చేసు కుంటున్నవారిలో అధికంగా సంతానలేమి సమస్య ఉంటుంది. సంతానోత్పత్తి చికిత్సల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ చికి త్సా విధానం సర్వసాధారణమైపోయింది. ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఐవీఎఫ్ ఫలదీకరణ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. కృత్రిమ గర్భధారణ, ముఖ్యంగా ఐవీఎఫ్ సం తానం లేని దంపతులను తల్లిదండ్రులుగా మారుస్తోంది.
ఐవీఎఫ్ అనేది కృత్రిమ ఫలదీకర ణంలో ఒక పద్ధతి దీన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’ అంటారు. ఈ పద్ధతిలో ఫలదీకరణం కోసం స్త్రీ అండంను పురుషుడి శుక్ర కణాలతో కృత్రి మంగా కలపడం జరుగుతుంది. టెక్నాలజీ సాయంతో లేబొరేటరీలో దీన్ని పూర్తి చేస్తారు. కృత్రిమ గర్భధారణ ద్వారా చాలా మంది తల్లిదండ్రులయ్యారు. ఐవీఎఫ్ ఫెర్టిలైజేషన్ లో బిడ్డ పుట్టే సక్సెస్ రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుం ది.
అందువల్ల ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులు తమ పని వేళలను చికిత్స చేస్తున్న డాక్టర్తో చర్చించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ చికిత్స ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి వైద్యుని సలహాతోపాటు సరైన మార్గదర్శకత్వంలో మాత్రమే ఈ చికిత్స పద్ధతిని ఎంచుకోవాలి” అని -డాక్టర్ పద్మజా దివాకర్ వెల్లడించారు.