calender_icon.png 1 August, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సేవలో మహబూబాబాద్

31-07-2025 12:00:00 AM

 ఎమ్మెల్యే భూక్య మురళినాయక్

వేములవాడ టౌన్: జులై 30 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్య మురళి నాయక్. కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి స్వామి వార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు.ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వచన పూర్వకంగా ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ వారికి శేష వస్త్రం కప్పి, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆలయ ఈ ఓ రాధా బాయి మర్యాదపూర్వకంగా కలిశారు.ఆలయం లో పవిత్రమైన కోడె మ్రొక్కు ను ఎమ్మెల్యే సమర్పించారు. వీరి వెంట ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రోటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ మహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి మరియు ఇతర ఆలయ సిబ్బందిఉన్నారు.