31-07-2025 12:00:00 AM
బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కో ఆర్డినేట్ నిసాని రామచంద్రం
సిద్దిపేట క్రైమ్, జూలై 30 : వచ్చే నెల 5న ఉమ్మడి మెదక్ జిల్లా బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేట్ నిసాని రామచంద్రం కోరారు. బుధవారం సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావు గారు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతూ తెలంగాణలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న, సిద్దిపేట జిల్లా ఇంచార్జి గజ్జల తిరుపతి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కటికల ఓంప్రకాష్, మెదక్ జిల్లా అధ్యక్షుడు స్వామిదాస్, ఉపాధ్యక్షుడు ఈర్ల మల్లేశం ముదిరాజ్, సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, ఇంచార్జి పంగబాబు, హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు వేల్పుల రాజు, ఇంచార్జి బాబు గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి ఎల్లం, సిద్దిపేట అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొండపలకల సంపత్, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.