25 August, 2026 | 3:40 AM

మహాకాళి సంక్రాంతికే..

25-08-2026 12:00 AM

ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్, పూజా కొల్లూరు నిర్మాణంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ స్పెక్టకిల్ ‘మహాకాళి’ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ‘మహాకాళి’ థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

‘శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. అసురుల గురువు శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ పోరాటం మరింత పెద్ద యుద్ధానికి దారితీస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ది ఎండ్ బిగిన్స్‌గా మహా సంగ్రామానికి నాంది పలికారు.

రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలు. అక్షయ్ ఖన్నా, శ్రియారెడ్డి, భూమిశెట్టి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఖుష్బూ సుందర్, రాకేశ్ బేడీ, సముద్రఖని, జితిన్ గులాటి, రజత్ కపూర్, మురళీశర్మ, నాసర్, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; డీవోపీ: సురేశ్ రగతు; ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగాల.