11-10-2025 09:08:59 PM
గ్రామస్తులపై రెచ్చిపోయిన మహారాష్ట్ర ఇసుక మాఫియా
సిర్పూర్ గ్రామస్తులపై మహారాష్ట్ర ముఠా దాడి
9 మంది గ్రామస్తులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
ఉమ్మడి జిల్లాలో ఇసుక మాఫియా దాడి కలకలం
కామారెడ్డి (విజయక్రాంతి): ఇసుక మాఫియా రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన గ్రామస్తులపై మహారాష్ట్ర ఇసుక మాఫియా దాడులకు దిగారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో శనివారం ఇసుక మాఫియా దాడిలో గ్రామస్తులు గాయపడిన ఉదాంతం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు తరలిస్తున్న ఇసుక మాఫియా రెచ్చిపోయారు. అడ్డు వచ్చినాక వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో 9 మంది గ్రామస్తులు గాయపడ్డారు. తమ గ్రామ సమీపంలోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించవద్దని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మహారాష్ట్ర ఇసుక మాఫియా ముఠా అడ్డుకునేందుకు వచ్చిన గ్రామస్తులపై దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఎక్కడి నుంచో వచ్చిన ఇసుక మాఫియా ముఠా స్థానిక గ్రామస్తులపై దాడులకు పాల్పడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్థానికుల అండదండల వల్లే మహారాష్ట్ర అక్రమ ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతుందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం కోస మెరుపు. వారికి మహారాష్ట్ర మూట నెల మామూలు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులకు నెలనెల మామూలు ముట్టజెప్పితే మహారాష్ట్ర అక్రమ ఇసుక ముఠా టిప్పర్రా కొద్ది అక్రమ ఇసుకను తరలిస్తున్నారు. 9 మంది గ్రామస్తులు గాయపడగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. కొడిచర్ల, పొతంగల్ మంజీర నది శివారు ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని కొడిచల్రా పోతంగల్ మంజీరా శివార్ ప్రాంతం వద్ద సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులపై మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా 50 మంది రెండు బొలెరో వాహనాలలో వచ్చి విచక్షణా రహితంగా దాడులకు పాల్పడినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. గత పది రోజుల క్రితం ఇదే సరిహద్దు ప్రాంతంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా డోమ్లి మండలం సిర్పూర్ గ్రామ ప్రాంతానికి చెందిన కొంతమంది నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కోడి చర్ల శివారు ప్రాంతంలోకి వచ్చి ఇసుక నింపకూడదు. సిర్పూర్ గ్రామస్తులు మహారాష్ట్ర ఇసుక మాఫియాతో వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు చూసుకుంటూ చివరికి రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సిర్పూర్ గ్రామానికి చెందిన 9 మంది తీవ్రంగా గాయాలకు గురయ్యారు.
కొడిచల్ర మంజీర శివారులో ఇసుక తరలింపును అడ్డుకోగా మహారాష్ట్ర ప్రాంతం కమ్మలూరు సాంఘి మెయిన్ కల్లూరు ప్రాంతానికి చెందిన ఇసుక మాఫియా ముఠా సిర్పూర్ రైతులపై దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఈ మూడు గ్రామాల ఇసుక మాఫియా పొడిచెర్ల మందిర నదిలో ఇసుక తవ్వకాలు సాధిస్తున్నారు. సిరిపూర్ కు చెందిన కొంతమంది ఇసుక తవ్వకాలు జరుపుకుంటారు. ఈ విషయంలో ఇరువార్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన తమ్ముడు సాంఘి మెయిన్ కల్లూరు గ్రామాలకు చెందిన ఇసుక మాఫియా మోటాల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు చెలరేగుతున్నాయి. తమ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరపకూడదు అంటూ పొడిచెర్ల పోతంగల్ గ్రామస్తులు సిరిపూర్ గ్రామానికి చెందిన కొంతమంది ఇసుక మాఫియా కు అడ్డు తాగుతున్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఈ ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తవ్వకాలు సాధిస్తున్నారు.
ఒకపక్క మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా సిర్పూర్ కు చెందిన ఇసుక మాఫియా మధ్య ఇసుక తవ్వకాల విషయంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి మహారాష్ట్ర ఇసుక మాఫియా కు సిర్పూర్ ఇసుక మాఫియా ప్రతినిధుల మధ్య గొడవలు తారస్థాయి కి చేరుకున్నాయి. శుక్రవారం ఇసుకను తరలించేందుకు వచ్చిన మహారాష్ట్ర ఇసుక మాఫియా ను సిర్పూర్ ఇసుక మాఫియా వారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెండు వాహనాల్లో వచ్చిన మహారాష్ట్ర ఇసుక ముఠా ఎవరైనా అడ్డుపడితే మహారాష్ట్ర ఇస్తా మాఫియా దారులకు పాల్పడుతున్నారు అంటూ పొడిచారురా పోతంగల్ సిల్పూర్ గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. తమపై దాడికి పాల్పడ్డ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారిపై పోలీసులు శాఖపరమైన చర్యలు తీసుకుని తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మహారాష్ట్ర ఇసుక మాఫియాకు స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉండడం వల్లే చెలరేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో గొడవలు రోజురోజుకు ఇసుక మాఫియాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. సిర్పూర్ కు చెందిన తొమ్మిది మంది గాయపడిన వారు నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిరిపూర్ గ్రామస్తులు తెలిపారు. రాడ్లతో దాడులకు పాల్పడ్డ మహారాష్ట్ర ఇసుక మాఫియాపై పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.