9 March, 2026 | 11:34 AM

కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు మహర్దశ

03-01-2026 12:00 AM
  1. పూడికతీత పనులకు ఖరారైన టెండర్లు
  2. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
  3. ప్రాజెక్టుకు తప్పనున్నప్రమాద ముప్పు

నిర్మల్, జనవరి 2 (విజయక్రాంతి) : ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని అత్యధికంగా వ్యవసాయ పంటలకు సాగునీరు అం దించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ కు మహర్దశ రానుంది . నిర్మల్ మంచిర్యాల జిల్లాలోని 78,000 ఎకరాలకు సాగునీరు అందించే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు క్రింద ఆయకట్టు సాగుతో పాటు ప్రాజెక్టు ముప్పు తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీ కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్థితిగతులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమగ్ర అధ్యయనం జరిపి చేపట్టవలసిన చర్యల పై దృష్టి పెట్టి నిధులను కూడా మంజూరు చేస్తుంది.

ఏడాది క్రితమే కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు క్లస్టర్ గేట్లతోపాటు వరద గేట్ల ను పాతవి తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 3. 60 కోట్ల నిధులను ఖర్చు చేసిన విషయం తెలిసింది. ఈ నిధులతో క్లస్టర్ గేట్ల మరమ్మతులు టెక్నికల్ యంత్రాలు ఇతర ప్రధాన సమస్యలను గుర్తించి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల క్రితం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి గేట్ల పైనుంచి వరద పారడంతో కట్ట చివరి భాగంలో గండి పడడం వరద తగ్గడంతో ప్రాజెక్టుకు త్రుటిలో ప్రాణగండం తప్పింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం ఇప్పుడు ప్రాజెక్టులో నేటి సామర్థ్యం పెంచేందుకు మట్టి పూడిక పనులకు శ్రీ కారం చుడుతున్నారు ఈ ప్రాజెక్టులో నీటి పరిణామం తగ్గినప్పుడు గోదావరి నది పై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ ద్వారా కడెం ప్రాజెక్టులకు నీళ్లు మళ్లించే విధంగా రూపకల్పన చేశారు

మట్టి పూడికతో తగ్గిన నీటి సామర్థ్యం

భారతదేశానికి స్వాతంత్ర అనంతరం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 19 49లో 600 కోట్లతో గోదావరి నదికి ఉపనదిగా ఉన్న కడెం వాగుపై ఈ ప్రాజెక్టు నిర్మించారు ప్రాజెక్టు పనులు 9 ఏళ్లు జరగగా 1958లో పూర్తయ్యాయి. కడెం నదికి 31 అడుగుల ఎత్తులో 2 51 మీటర్ల పొడుగులో 174 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించినట్టు రికార్డులు ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 7.06 టీఎంసీలు . ఈ ప్రాజెక్టు గోదావరి వాలి ప్రాజెక్టుగా మట్టి పూడికపోకుండా అడ్డుకట్ట వేసి ఆ సాగునీటితో పంట భూములకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కడెం పెంబి ఇచ్చోడ నేరడిగొండ గుడియత్నూర్ సోనాల సిరికొండ ఉట్నూర్ పరివాహక ప్రాంతంలో ఉన్న వాగుల నుండి వచ్చిన వరద నీరు విలువ ఉంటుంది.

ప్రాజెక్టు రెండు కాలువలు నిర్మించారు ఎడమ కాలువ 76 కిలోమీటర్లు కుడి కాలువ 8 కిలో మీటర్లు ఏర్పాటు చేశారు కడెం దస్తురాబాద్ జన్నారం లక్షటి పేట్ మంచిర్యాల మండలాల్లోని 78 వేల ఎకరాలకు సాగునీరు అందించదుకు ఉపయోగపడింది.

ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు గడిచాయి. ప్రాజెక్టులోకి ప్రతి సంవత్సరం లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడం గుట్టల మధ్య ఈ ప్రాజెక్టు ఉండడంతో మట్టి చెత్త చెదారం బండలు ప్రాజెక్టు నీటిలో పేరుకుపోయాయి దీంతో ప్రాజెక్టు నీటి సామర్థ్యం 7.06 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.90 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది అంటే సామర్థ్యం కంటే 2.16 టీఎంసీల నీరు మట్టి పూడుకపోవడం బండరాలు ఏర్పడడం కారణంగా ప్రాజెక్టు తక్కువ కాలంలోనే నిండడం ఆ తర్వాత నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో గోదావరిలోకి గేట్ల ద్వారా వదులుతున్నారు.

వరద ఎక్కువైనప్పుడు ప్రాజెక్టు ప్రమాదం పొంచి ఉంది. ఆయకట్టు రైతులకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు దీంతో రైతులు నష్టపోతులను ఉద్దేశంతో ప్రభుత్వం మట్టి తీత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు

నిర్మల్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులో ఒకటైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు నీటిలో ఉన్న మట్టి చెత్తను తొలగించే పనులను ఏజెన్సీకి అప్పగించడంపై జిల్లా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ టెండర్లు పూర్తికాగా మూడు రోజుల క్రితం ఆధునిక యంత్రాలతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ కంపెనీ నిర్వాహకులు ప్రాజెక్టులు సర్వే చేశారు శాటిలైట్ సర్వే యంత్రాల సర్వే ద్వారా ప్రాజెక్టు నీటిలో ఎక్కడ ఎంత మట్టి ఉంది లోతు ఎంత బండరాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సర్వే నిర్వహించారు.

ప్రాజెక్టులో ఉన్న మట్టి వ్యవసాయ పంట పొలాలకు రైతులు స్వచ్ఛందంగా తీసుకెళ్లి విధంగా మోబిలేషన్ చేయనున్నారు ప్రాజెక్టు నీటిలో నుంచి ఆధునిక యంత్రాల సాయంతో మట్టి తీత పనులు చేపట్ట నుండగా ఆ మట్టిని పంట వేసుకుంటే పంట భూములు సారవంతమై అధిక దిగుబడును సాధించుకునే విధంగా యంత్రాం గం చర్యలు చేపడుతుంది.

ఈ బాధితులు జిల్లా కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని మట్టితీత పనులకు సహకారం అందిస్తున్నారు. ప్రాజెక్టులో మట్టి తొలగించి పనులు పూర్తయితే నీటి సామ ర్థ్యం పెంచి కాడెం ప్రాజెక్టు కు ప్రమాదం కూడా తగ్గి అవకాశం ఉంది అయితే ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆ యొక్క రైతులు కోరుతున్నారు

రైతుల ప్రజల కోసమే

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అత్యధిక వ్యవసాయ సాగు పంటలకు సాగునీరు అందించే కడెం ప్రాజెక్టు పూర్వ వైభవం తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంది ఏడాది క్రితం చెడిపో యిన వరద గేట్లను మరమ్మతులు చేసేందుకు సుమారు నాలుగు కోట్ల వరకు నిధులు ఖర్చు చేసిన ఇప్పుడు ప్రాజెక్టులో మట్టి తీత పనులకు టెండర్లు ఖరారు కావడంతో నీటి సామర్థ్యం పెరిగి నిర్మల్ మంచిర్యాల జిల్లాలోని వేలాది మంది రైతులకు ఎంతో ప్రయోజనం దక్కనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మట్టి తీత పనులు చేపడుతున్నారు.

 బొజ్జు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యే

కడెం ప్రాజెక్టుకు పూర్వం వైభవం

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు మట్టి తీత పళ్ళతో పూర్వ వైభవం రానుంది. చివరి ఆయకట్టు వరకు నిర్దేశించిన లక్ష మేరకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రాజెక్టులో మట్టితీత పనులు త్వరలో చేపట్టే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది ప్రాజెక్టులో ఉన్న మట్టిని రైతులకు ఉచితంగా అందించేందుకు ఇప్పటినుండి రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుం టున్నాం. మట్టి నిల్వ వచ్చేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టిన రైతులు కూడా సహకరించాలి

-అభిలాష అభినవ్ జిల్లా కలెక్టర్