calender_icon.png 2 January, 2026 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

02-01-2026 10:07:09 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శుక్రవారం ‘యూత్ ఆసిఫాబాద్ క్రికెట్ కప్ – సీజన్ 2’ ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రీడాలను బిఆర్ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల వైపు దృష్టి సారించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.