calender_icon.png 2 January, 2026 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటెలను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జవహర్ నగర్ బిజెపి నాయకులు

02-01-2026 10:05:01 PM

జవహర్ నగర్, (విజయక్రాంతి): కొత్త సంవత్సరం  పురస్కరించుకొని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసం వద్ద కలిసి ఆంగ్ల నూతన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మేడ్చల్ బిజెపి అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు విక్రం రెడ్డి కి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు సంతోష్ గుప్తా, మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్, మేడ్చల్ రూరల్ జిల్లా IT ఇంచార్జ్ కుర్ర పుణ్యరాజు,తూర్పు శాఖ అధ్యక్షులు జోగారావు, పశ్చిమ శాఖ ప్రధాన కార్యదర్శి వేపుల సన్నీ, అనిల్ గుప్తా,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.