23-08-2025 01:10:57 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (విజయక్రాంతి) : నగరంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ పట్టింది. రాను న్న పండుగలను దృష్టిలో ఉంచుకుని, జీహెఎంసీ ‘రోడ్ సేఫ్టీ డ్రైవ్’ పేరుతో యుద్ధ ప్రాతి పదికన మరమ్మతు పనులను చేపట్టింది. కేవలం గుంతలు పూడ్చడమే కాకుం డా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ నగరవాసుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ఈ పనుల పురోగతిని జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా పర్యవేక్షిస్తూ, పనులు వేగం గా పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగం గా, జీహెఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటివరకు గుర్తించిన 12,696 గుంతలకు గాను, శుక్రవారం నాటికి 9,899 గుంతలను పూడ్చివేసింది.
వీటితో పాటు దెబ్బతిన్న 506 క్యాపిట్‌లకు మరమ్మతులు పూర్తి చేసింది. ప్రమాదకరంగా మారిన 287 క్యాపిట్ కవర్లను తొలగించి, కొత్తవి ఏర్పాటు చేసింది.7 సెంట్రల్ మీడియన్లకు మరమ్మతులు చేపట్టింది.నగరంలోని అంతర్గత రోడ్ల తో పాటు, గ్రేటర్ పరిధిలోని జాతీయ రహదారుల మరమ్మతులను కూడా జీహెఎంసీ చేపట్టడం విశేషం.
సోషల్ మీడియాలో ఫిర్యాదు..తక్షణమే స్పందన
క్షేత్రస్థాయి పనులతో పాటు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలోనూ జీహెఎంసీ చురుగ్గా వ్యవహరిస్తోంది. హైటెక్ సిటీ ఆర్‌ఓబీ ఫ్లుఓవర్‌పై ఏర్పడిన భారీ గుంతల ఫొటోలను ఒక నగరవాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐటీ కారిడార్‌లోని ఈ కీలక మార్గంలో వాహనదారుల ఇబ్బందులను, భద్రతా సమస్యను తీవ్రంగా పరిగణించిన జీహెఎంసీ ఇంజనీరింగ్ బృందాలు తక్షణమే స్పందించాయి.
కేవలం గుంతలను పూడ్చడమే కాకుండా, ఆ ప్రాంతంలో కొత్త రహదారిని వేశాయి.ఈ సత్వర స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కావలి చంద్రకాంత్ అనే నెటిజన్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, హైటెక్ ఆర్‌ఓబీ ఫ్లుఓవర్‌పై పెద్ద గుంతలు పూడ్చి కొత్త రహదారి వేసిన జీహెఎంసీకి ధన్యవాదాలు.
దీనివల్ల ప్రయాణికులు సురక్షితంగా, సులభంగా, వేగంగా ప్రయాణించ వచ్చు, అని పేర్కొంటూ జీహెఎంసీ, కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌ను ట్యాగ్ చేశారు. ఈ ఘటన, రహదారుల పరిరక్షణ, రవాణా భద్రతకు జీహెఎంసీ ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది.