calender_icon.png 23 August, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు రైతుల సమస్యలపై ఐక్యంగా ఉద్యమం చేస్తాం

23-08-2025 01:10:33 AM

-శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-ఎమ్మెల్యే హరీశ్‌బాబు దీక్ష విరమణ

కాగజ్ నగర్, ఆగస్టు 22(విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 49 రద్దు, పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమం చేస్తామని బిజెపి శాసనసభక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కే. వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల శంకర్ అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ లో  అధిక నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే హరీష్ బాబును పరామర్శించి, నిమ్మరసం ఇచ్చి దీక్ష విధింపజేశారు.

ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ  ప్రజల కోసం ఎమ్మెల్యే బ్రతకాల్సి ఉందని, మునుముందు రాష్ర్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడల్వంచుతామని , జీవో 49 సాధించుకుంటామని, అలాగే పోడు  రైతులు ,3 లక్షల 75 వేలమంది రైతులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. 

అసెంబ్లీలో, బయట కూడా ప్రభుత్వా న్ని నిలదీస్తామని, ఎమ్మెల్యేను దీక్ష విరమించాలని కోరారు. అలాగే నాయకులు కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే దీక్ష విరమణకు ఒప్పుకోవడంతో  ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు దీక్ష విర మించారు. శుక్రవారం వాటికి దీక్ష 5వ రోజు కు చేరుకుంది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు ద్విచక్ర వాహనం రాయలే నిర్వహించా రు. కాగజ్‌నగర్ బంద్ సంపూర్ణంగా జరిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.