23-08-2025 01:11:55 AM
-మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్ నగర్, ఆగస్టు 22(విజయ క్రాంతి) సిర్పూర్ నియోజకవర్గంలో ఒకవైపు యూ రియా కొరత.. మరోవైపు పోడు భూముల సమస్యతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. తమ సొంత నిధులతో బట్టుపల్లి- రహదారి నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు.
శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడాతూ.. తమ హాయంలో రైతులకు యూరియా, పోడు భూముల సమస్య లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రైతులు సమస్యలతో ఇబ్బంది పడుతుండగా వారిని పట్టిం చుకోకుండా పలువురు నాయకులు దీక్షల పేరిట డ్రామాలు చేస్తున్నట్లు ఆరోపించారు. యూరియాను పంపిణీ చేయాలని లేని పక్షంలో రైతుల ఆధ్వర్యంలో ప్రతి మండలం లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.