calender_icon.png 9 July, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ కుంటకు మహర్దశ

09-07-2025 12:00:00 AM

నిన్నటి దుస్థితి.. నేటి ప్రగతి

ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు బతుకమ్మ కుంట చెరువు గుర్రపు డెక్క, చెత్తాచెదారంతో నిండి, మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు హైడ్రా అధికారులు చెరువు పునరుజ్జీవన పనులను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ప్రస్తుతం చెరువులో పూడికతీత, వ్యర్థాల తొలగింపు, కట్ట బలోపేతం వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైడ్రా విడుదల చేసిన ఏరియల్ వ్యూ చిత్రాల్లో, కొన్ని నెలల క్రితం నాటి దుస్థితికి, ప్రస్తుత పరిస్థితికి మధ్య ఉన్న స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

  1. చెరువుకు కొత్త జీవం పోస్తున్న హైడ్రా 
  2. సుందరీకరణతో పాటు వరద నివారణకు చర్యలు
  3. శరవేగంగా పూడికతీత, వ్యర్థాల తొలగింపు
  4. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయకాంత్రి): ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై, మురికికూపంగా ఉన్న బతుకమ్మ కుంట చె రువు నేడు సరికొత్త జీవం పోసుకుంటోంది. హైడ్రా చేపట్టిన పునరుజ్జీవన పనులతో దాని రూపురేఖలే మారిపోతున్నాయి. పూడికతీత, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వరద నివారణే కీలకం

కేవలం సుందరీకరణ మాత్రమే కాకుం డా, వరద నిర్వహణను కూడా ఈ ప్రాజెక్టులో కీలక అంశంగా చేర్చినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కాలువలను శుభ్రపరచడం ద్వారా భారీ వర్షాల సమయంలో సమీప ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఇది దోహదపడుతుంది.

పనులు పూర్తయితే బతుకమ్మ కుంట స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రాంతంగా మారడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు, వరద నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడనుంది.

రూ.7-8 కోట్ల అంచనాతో పనులు

సుమారు రూ.7-8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైడ్రా తీసుకున్న ఈ చొరవపై స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

కమిషనర్ రంగనాథ్ ముందు చూపు, పనులను వేగంగా అమలు చేస్తున్న తీరును కొనియాడుతున్నారు. నగర పర్యావరణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడ టంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం, హైడ్రా కృషి ఈ ప్రాజెక్టు విజయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ పునరుజ్జీవన ప్రయత్నం కేవలం ఒక చెరువును బతికించడమే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణకు ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోందని పర్యావరణవేత్తలు ప్రశంసిస్తున్నారు.