calender_icon.png 9 July, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు గ్రహణం!

09-07-2025 12:00:00 AM

  1.   32 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన 
  2. స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది ఒక్కటే
  3. లబ్ధిదారుల ఎంపికలోనూ లోపించిన పారదర్శకత
  4. ఇండ్లు వద్దు అని చెప్పిన 22 మంది

ప్రభుత్వాలు మంచి పథకాలే తీసుకువస్తాయి. కానీ వాటిని అమలుచేయటంలోనే అనేక తిరకాసులు ఉంటాయి. క్షేత్రస్థాయిలో ముఖాలు చూసి తిలకం అద్దే బాపతే అధికంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏదై నా ఏదో ఓ నాయకునికి కొమ్ముకాయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి లబ్దిదారులకు ఎదురౌతుంది. నిజమైన పేదలు పేదలుగానే మగ్గి పోతున్నారు.

పెబ్బేరు జూలై 8 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అ మలు కాలేకపోతుంది. అనేక రకాల కారణా లు ముడిపడి ఉండటం, అధికారులు ఎంత ప్రయత్నించినా నత్తనడకనే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వ గా, పెబ్బేరు మండలానికి 360 ఇండ్లు మం జూరు అయ్యాయి.

పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో 144 ఇండ్లు మంజూరు అయ్యా యి. మండలంలోని ఈర్లదిన్నె గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ క్రింద 73 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వగా కేవలం ఒక్క ఇల్లు మాత్ర మే స్లాబ్ వరకు పూర్తికావచ్చింది. 32 ఇండ్ల కు ముగ్గు పోయగా, 18 ఇండ్లు బేస్మేట్ వర కు చేరుకున్నాయి. ఆలస్యానికి అమావాస్య ఒక కారణం అన్నట్లు ఉంది పెబ్బేరు మం డల ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి. 

సుముఖంగా ఉన్నవారికి ఇండ్లు మంజూరు కాలే....

నిజంగా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉండి కట్టుకోవటానికి సుముఖంగా ఉన్నవారికి ఇండ్లు మంజూరు కాలేదు. పాలలో తో డు లాగా అని భావించే వారికి ఎక్కువ మో తాదులో మంజూరీ అయ్యాయి. అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి సాధించలేకపోతోంది. తెలంగాణ రాక మునుపు ప క్కా ఇంటినిర్మాణం ప్రకారం నిర్మించిన ఇం డ్లకు బిల్లులు వస్తాయని లబ్ధిదారులు భావించడం తో దరఖాస్తు దారులు పెరిగారు.

కానీ జియోగ్రాఫిక్ టాగింగ్ ద్వారా ఇండ్ల నిర్మా ణం కొనసాగే ప్రక్రియ. 600 చదరపు అడుగుల విస్తీర్ణం నియమం కొంతమందిని నిరు త్సాహపరిచింది. అదేక్రమంలో ఇప్పటికే మే ము నిర్మాణం చేయలేము అని వివిధ రకాల కారణాలతో రాతపూర్వకంగా లబ్దిదారులు రాసి ఇవ్వటం గమనార్హం. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే సుమారు 22మం దికి పైగా ఇండ్లు వద్దు అని రాసిచ్చారు.

అయితే ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అనేది ప్ర స్తుతం అధికారులను వేధిస్తున్న ప్రశ్న. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు పారదర్శకంగా పనిచే యలేక పోవటం మొదటి కారణం అయితే. గతంలో కట్టిన ఇండ్లకు బిల్లులు ఇవ్వటం కుదరదు, కడితేనే బిల్లు ఇవ్వటం జరుగుతుంది అని అధికారులు అవగాహన కల్పిం చడంలో విఫలం అయ్యారు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కీ కొమ్ముకాయలేదు.

కానీ విఫ లం అయ్యారు. జూన్ 12వతేదీన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతులమీదుగా ప్రొసీడిం గ్స్ అందుకున్నారు. హిందువులకు ఆషాఢం లో ఎటువంటి నిర్మాణాలు, శుభకార్యం చేయరు కాబట్టి అర్ధాంతరంగా ఆగిపోయా యి. అందునా పీర్లగుంత సమయం లో దాదాపు గా ఎటువంటి నిర్మాణం చేపట్టరు. అది వారి సెంటిమెంట్ తో ముడిపడి ఉంది. అందుకే అధికారులు ఎంత వెంటపడినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో పురోగతి హుళక్కి. 

వీలైనంత మేరకు లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నాం

మేము వీలైనంత మేరకు లబ్దిదారులకు అవగాహన కల్పిస్తున్నాము. అయినప్పటికీ వారికి ఉన్న సెంటిమెంట్ రీత్యా ముందుకు సాగడం లేదు. తప్పకుండా కొత్త నిర్మాణం చేపట్టాలని నిబంధనలు, నిర్ణీత స్థలం అనే నిబంధనలు లబ్దిదారులకు కాస్త ఇబ్బంది గా ఉంది. అయినా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేస్తాము.

 రోజా యంపిడీఓ ఇన్చార్జ్, పెబ్బేరు

జెండాను మోసిన నాకే ఇందిరమ్మ ఇల్లు రాకపోవడం అవమానకరం..... 

నేను ఊహ తెలిసినప్పటినుంచి కాం గ్రెస్ కార్యకర్తను. 2017 లో మా ఇల్లు, అప్పుడు కురిసిన భారీ వర్షాలకు పడిపోతే, అప్పటి తెరాస ప్రభుత్వం కనీసం నష్టపరిహారం కూడా అందించలేదు. అ ప్పుడు తహశీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీ సం ఒక్క అధికారి కానీ, ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఎటువంటి సహాయం చేయ లేదని అన్నారు. తాను కరడుగట్టిన కాం గ్రెస్ కార్యకర్తనని ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కూడా రానీయకుండా చేసారు.

ఊరు వదలి ఊరు బయట ప్లా స్టిక్ కవర్లతో గుడిసె వేసుకుని బతుకుతు న్నాం అన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పటికి నాకే మొండి చేయి చూ యించారని వాపోయాడు. గతం లో తనను శివసేనా రెడ్డి,ఒబేదుల్లా కొత్వా ల్, ప్రస్తుత ప్రణాళిక సంఘం చైర్మన్ జి ల్లెల చిన్నా రెడ్డి తనను కలిసి పరామర్శించారని. కానీ జెండాను మోసిన నాకే ఇందిరమ్మ ఇల్లు రాకపోవడం అవమానకరంగా ఉందని తెలిపారు. 

మాల వెంకటస్వామి, యాపర్ల 

టార్ఫాలిన్ కవర్ లతో కప్పుకొని బతుకునీడుస్తున్నాము

మేము చాలా సంవత్సరాల క్రితం నుంచి టార్ఫాలిన్ కవర్ లతో కప్పుకొని బతుకునీడుస్తున్నాము. మేము ఇల్లు క ట్టుకుంటామని దరఖాస్తు చేసి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. వ ద్దు అన్నవారికి పిలిచి పిలిచి ఇస్తున్నారు. నిజంగా అవసరం ఉన్న మాలాంటి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కాలే దు. వర్షాకాలం వస్తే మాతో పాటు పిల్లలు కూడా నిద్ర లేని రాతృలు గడపాల్సిందే. 

బైండ్ల జ్యోతి, 

కురుమూర్తి చెలిమిల్ల, 5వ వార్డు