calender_icon.png 18 July, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్ బజార్ కమ్యూనిటీ స్కూల్‌లో మహాత్మాగాంధీ జీవిత చరిత్ర సినిమా ప్రదర్శన

18-07-2025 12:00:00 AM

- ముఖ్యఅతిథిగా హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ సూచనల మేరకు, వైట్ టీ షర్టు ప్రోగ్రాంలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గంలోని రసూల్‌పుర గన్‌బజార్ కమ్యూనిటీ హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు మహాత్మాగాంధీ జీవిత చరిత్ర సినిమాను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేశ్ హాజరై సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన యువజన కాంగ్రెస్ నాయకులను అభినందించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ పాత్ర మరువలేనిదని, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం సిద్ధించేలా కృషి చేసిన మహనీయులని, హింస ద్వారా ఏది సాధ్యం కాదని కేవలం అహింసతోనే ఎటువంటి కార్యానైనా సాధించవచ్చని నిరూపించారన్నారు.

మన స్వాతంత్య్ర పోరాటాన్ని, మహనీయుల  చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హైదర్, నాయకులు నరేశ్, శాంసన్ రాజు, తౌఫిక్, యాదగిరి, నాగేశ్ యాదవ్, సదానంద్, ఆంజనేయులు, సందీప్, ప్రదీప్ పాల్గొన్నారు.