calender_icon.png 18 July, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకో బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

18-07-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): యూకో బ్యాంక్ నూతన శాఖను అశ్వరావుపేటలో గురువారం యూకో బ్యాంక్ తెలంగాణ జోన్ డీజీఎం, జోనల్ మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. బడుగు, బలహీనవర్గాలకు మెరుగైన బ్యాం కింగ్ సేవలు అందించేందుకు ఈ శాఖను నెలకొల్పారు. జోనల్ మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులకు సూచిం చారు.

యూకో బ్యాంక్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు కృషి చేస్తోందని, కస్టమర్స్ కోసం మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ గోపాల్ యూకో బ్యాంక్ ప్రారంభించిన కొత్త స్కీం ‘ఆశ్రయ్’ గురించి వివరిం చారు. ఐటీ రిటర్నులు దాఖలు చేసిన ఉద్యోగులకు యూకో బ్యాంక్ గృహ రుణా లు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.