18-07-2025 12:00:00 AM
సత్తుపల్లి నియోజకవర్గంలోని 4819 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 5 కోట్ల 68 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులు
సత్తుపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం /సత్తుపల్లి, జూలై 17 (విజయ క్రాంతి):మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వం చిత్తశుద్ధితో, నిజాయితితో పనిచేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంత్రి, గురువారం సత్తుపల్లి లోని రాణి ఈవెంట్ ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ లతో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ భీమా, ప్ర మాద భీమా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చే సారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, కదం తొక్కి, పెద్దఎత్తున మహిళలు సంబరాలకు వచ్చారని, అందరి దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ ప్రభు త్వం 18 నెలలు పూర్తి చేసుకుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్డీవో జయ శ్రీ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీల త, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, జి ల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికా రి సునీల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, సత్తుపల్లి నియోజకవర్గ తహసీల్దా ర్లు, ఎంపిడివో లు, కల్లూరు, సత్తుపల్లి మునిసిపల్ కమిషనర్లు, మండల సమాఖ్య సభ్యు లు, ఏ.పి.ఎం.లు, మహిళలు, ప్రజాప్రతినిధు లు, తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట పట్టణాన్ని సుందరీకరిస్తాం.
అశ్వారావుపేట, జూలై 17,(విజయ క్రాంతి) :అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న అ శ్వారావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి, సుందరీకరిం చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గురువారం అశ్వారావు పేట రింగ్ రోడ్ నుండి దొంతికుంట చెరువు వరకు మంత్రి మార్నింగ్ వాక్ ను అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయ ణ, భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రా హుల్ తో కలసి చేశారు . ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెం ట వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.