సామాజిక ఉద్యమాల తొలి తరం గొంతుక జ్యోతిబాపూలే
సత్తుపల్లి డిపోలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
సత్తుపల్లి,(విజయక్రాంతి): సామాజిక ఉద్యమాల తొలితరం గొంతుక జ్యోతిబాపూలే అని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం సత్తుపల్లి డిపోలో జ్యోతిబాపూలే 199 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చత్రపాటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అణగారిన వర్గాల చైతన్యానికి ప్రతీక, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహాత్ముడు జ్యోతిబాపూలే అని అన్నారు. సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు జ్యోతిబాపూలే అని ఆయన కొనియాడారు. గొప్ప విద్యావేత్త, సంఘసంస్కర్త మహిళలకు విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహానీయుడు జ్యోతిబాపూలే అని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను డిపో మేనేజర్ కొనియాడారు.




