3 June, 2026 | 1:57 AM

ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్

03-06-2026 01:17 AM
  1. హామీలను నెరవేర్చడంలో విఫలం
  2. రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ 
  3. గన్‌పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా మంగళవారం గన్‌పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి తెలంగాణ రాష్ట్ర రా ష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్‌ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని అ న్నారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆశలు పెట్టుకొని అధికారంలోకి తీ సుకువచ్చినా, ఆ ఆశలు వర్షపు నీటిలా పారిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రవ్యాప్తం గా వారి నాయకులు ప్రజల డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు అవినీతిపరులుగా మారి, ప్రజ ల సమస్యల పట్ల స్పందించకుండా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమ ఆశయాల కు అనుగుణంగా పాలన సాగడం లేదని అన్నారు.

తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘సకల జనుల పోరాటం‘ తరహాలో మరో ఉద్యమా నికి సిద్ధం కావాలని, అవినీతిని నిర్మూలించి ‘విధులు, నీళ్లు, నియామకాలు‘ అనే తెలంగాణ ఉద్యమ ప్రధాన లక్ష్యాలను సాధించా లని పిలుపునిచ్చారు. దిలీప్ కుమార్ నాయకత్వంలో అర్‌ఎల్డీ సభ్యులు రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేశా రు. త్వరలోనే రిటైర్డ్ ఆర్మీ అధికారుల సహకారంతో లక్ష్యం కోసం లక.

సైన్యం‘ పేరుతో యువత నియామక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ యోధులను గుర్తించే కమిటీకి అంద్రెట్, సమైక్యవాది అయిన కేశవరావును చైర్మన్‌గా నియమించడం హాస్యాస్పదమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎల్డీ యువజన అధ్యకుడు రాజ్ కుమార్‌రెడ్డి, బీరప్ప (-యాదాద్రి జిల్లా అధ్యకుడు, ప్రతినిధి), విశాల్ (ప్రధాన కార్యదర్శి), రోషట్ జైన్, ఓంకార్ (కార్యదర్శి), గిరి (ఖజాంచి, టీఆర్‌ఎల్డీ), శ్రీనివాస్ (కార్యదర్శి, టీఆర్‌ఎల్డీ), ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.