తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
11-04-2026 03:44 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గొప్ప సంఘసంస్కర్త, తొలి విప్లవకారుడు, సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవం దళిత బహుజన సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు.
18వ శతాబ్దంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యం ఇస్తూ తన భార్యకు చదువు నేర్పించి ఆమెను తొలి మహిళ గురువుగా తీర్చిదిద్దిన ఘనత పూలేకే దక్కిందని పేర్కొన్నారు. అలాగే నేటి ప్రభుత్వాలు ఆయన ఆశయాలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.




