calender_icon.png 9 October, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ ఎవరికిచ్చినా.. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి: మహేశ్ గౌడ్

09-10-2025 12:50:10 PM

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Goud) కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ దృష్ట్యా జూమ్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, నామినేషన్లు దాఖలు అంశాలపై చర్చించారు. నామినేషన్ల దాఖలులో పార్టీ నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ, రేపు జడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేస్తామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేయసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపుకు కృషి చేయాలని మహేశ్ గౌడ్ నేతలకు పిలుపునిచ్చారు.