calender_icon.png 9 October, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

09-10-2025 01:29:26 PM

హనుమకొండ,(విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయిస్ బెనిఫిట్ ను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల(Retirement benefits) సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చ్ 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను 18 నెలలు గడిచిన చెల్లించకపోవడం దారుణమని, పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని అన్నారు.కొంతమంది పెన్షనర్లు తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మార్చ్ 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు బకాయి పడ్డ పెండింగ్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇప్పటివరకు రిటైర్డ్ అయిన వారికి రావలసిన బకాయిలను చలిగించకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు రుణాలు తీర్చలేక, నానా ఇబ్బందుల కు గురవుతూ ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేని దైనందిన స్థితిలో ఉన్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 26 మంది రిటైర్డ్ అయిన పెన్షనర్లు చనిపోవడం జరిగిందని, కొంతమంది పెన్షనర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు ఆదేశాల మేరకు కొద్ది మందికి బకాయిలు చెల్లించారని అన్నారు. ఇంకా చాలామందికి చెల్లించాల్సి ఉందని,కోర్టుకు వెళ్ళని వారు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 13వేల మంది రిటైర్డ్ అయ్యారని,రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కొంతమందికి మాత్రమే బకాయిలు చెల్లించడం జరిగిందని అన్నారు. పిఆర్సి, 2017 జిపిఎఫ్, గ్రాటిటీ మొదలైన సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకునే సరెండర్ లీవ్స్ మొదలైనవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి భోగేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరు  దేవదాస్,ఎండి మహబూబ్ అలీ, గౌరవ అధ్యక్షులు ఎం. చంద్రమౌళి,సెక్రటరీ అబ్దుల్ గఫార్, దామోదర్, సుర కుమారస్వామి, విష్ణువర్ధన్, సోమయ్య, రమణారెడ్డి, కిషన్ నాయక్, ఇంద్రసేనారెడ్డి, అశోక్ కుమార్,రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.