09-10-2025 02:03:21 PM
దౌల్తాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ(Nomination process) సజావుగా సాగాలని ఆర్డీవో సదానందం(RDO Sadanandam) అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సిద్దిపేట ఆర్డీవో సదానందం, గజ్వేల్ ఏసీపీ నర్సింలు ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అభ్యర్థులు సమర్పిస్తున్న నామినేషన్ పత్రాలను పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా శ్రద్ధగా స్వీకరించాలని ఆర్డీవో సదానందం సూచించారు.
అంతే కాకుండా నామినేషన్ దశలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ నర్సింలు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.తొగుట సీఐ లతీఫ్, తహశీల్దార్ చంద్రశేఖర్ రావు,ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గఫూర్ ఖాద్రీ,ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తదితరులున్నారు.