calender_icon.png 9 October, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

09-10-2025 02:01:14 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఏఓసీ సెంటర్ వద్ద గురువారం ఉదయం 25 మంది విద్యార్థులతో వెళ్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు(Delhi Public School bus) ఇంజిన్ నుంచి మంటలు రావడంతో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సులోంచి పొగలు రావడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. బస్సు కంటోన్మెంట్‌లోని మహేంద్ర హిల్స్ వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. 

బస్సు డ్రైవర్ ఇంజిన్ నుండి దట్టమైన పొగలు రావడాన్ని గమనించి, విద్యార్థుల భద్రత కోసం బస్సు తలుపులు త్వరగా తెరిచాడు. విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బంది వెంటనే పొగను ఆర్పడానికి అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించారు. అయితే ఆ ప్రాంతం గుండా వెళుతున్న ప్రయాణికులు పిల్లలకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ జి. నాగరాజు మీడియాతో మాట్లాడుతూ.. “అందరు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, వారిని వేరే స్కూల్ బస్సులో తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ లేదా విద్యార్థులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో కొన్ని నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోయింది.