09-10-2025 02:04:35 PM
- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.
నాగర్‌కర్నూల్, (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఆధారంగానే మనుగడ సాగుతోందని అందుకు విద్యార్థులకు సాంకేతిక విద్య కీలకం కానుందని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ని పరిశీలించారు. డిగ్రీలతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సాంకేతిక విద్య ద్వారా స్వయం ఉపాధి మార్గాలు కూడా లభిస్తాయన్నారు.