09-10-2025 02:33:58 PM
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్లను(BC reservations) 42శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ ప్రారంభించింది. రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై నిన్న హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ కొనసాగింది.