09-10-2025 01:31:18 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంరాజ్యాంగం కల్పించిన హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కాలరాస్తూ నిరసనలను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ కన్వీనర్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో “ఛలో బస్ భవన్” కార్యక్రమానికి బయల్దేరిన ఆదర్శ్ రెడ్డిని, బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. “మహిళలకు ఫ్రీ బస్సు అంటూ ప్రచారం చేస్తూ, పురుషులకు డబుల్ చార్జీలు వేయడం ప్రజలతో మోసం చేయడమే” అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ అరెస్టుల పేరుతో నిరసనలను అడ్డుకోవడం సిగ్గుచేటని ఆదర్శ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.