15 June, 2026 | 4:54 PM

షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ

24-08-2024 12:55 AM

హీరో రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. ఆ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రవితేజ కుడి చేతికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. ‘ఆర్‌టీ75’ అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ గాయపడిన విషయం తెలిసి, త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.