31-12-2025 12:00:00 AM
సిద్దిపేట, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అఖిలభారత యాదవ మహాసభ యువజన విభాగం సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడిగా బొల్లివేణి మహేష్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం అందించారు.
యాదవ జాతి జాగృ తి కోసం యువజన విభాగం కృషి చేయాలని శ్రీహరి యాదవ్ సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు యాదవ కులస్తులకు సేవలు అందిస్తానని మహేష్ వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐల య్య యాదవ్, బొల్లు రాము యాదవ్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.