31-12-2025 12:00:00 AM
కొల్చారం, డిసెంబర్ 30 :మండల కేంద్రంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం, సహకార సంఘం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మం గళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, అమ్మకాలు, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు.
జిల్లాలో పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 12,673 యూరియా జిల్లాకు వచ్చి ఉందన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి ఏ పుణ్యవతి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఏ ఈ ఓ లు రాజ శేఖర్ గౌడ్, స్రవంతి పాల్గొన్నారు.