31-12-2025 12:00:00 AM
తూప్రాన్, డిసెంబర్ 30 : మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు. నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని, ము ఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని తూప్రాన్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.