ఆగస్టు 15 కల్లా మహిళాశక్తి ‘మీ సేవ’లు
- మహిళా సంఘాలకు మరో స్వావలంబన స్కీం
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్కూల్ యూనిఫామ్‌లను కుట్టించే బాధ్యతను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు అప్పగించి వారికి సూమారు రూ.50 కోట్లు ఆదాయం వచ్చేలా చేసింది. మరో వైపు హిళాశక్తి క్యాంటిన్లను మహిళ ఆధ్వర్యంలోనే నడిచే విధంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంటిన్లను సచివాలయంలో గత వారం రోజుల క్రితం ప్రారంభించింది. కలెక్టర్ కార్యాలయాలు, ప్రభుత్వం సంస్థలు, కార్పోషన్ కేంద్రాల, బస్టాండ్‌లు, జాతీయ రహదారుల వెంట ప్రభుత్వం మొత్తం 151 క్యాంటిన్ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుంది. అంతే కాకుండా అంగన్ వాడీ కేంద్రాల్లోకు చెందిన పిల్లలకు కూడా స్కూల్ యూనిఫామ్‌లను మ హిళసంఘాలకే ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
అంతటితో ఆగకుండా మహిళాసాధికారతే లక్ష్యంగా ముందుకు పోతున్న ప్రభుత్వం.. కొత్తగా ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన వందలా మందికి సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా శక్తి పథకం కింది వీటిని కూడా మహిళా సంఘాలకే మంజూరు చేయనుంది. ఈ ఆన్‌లైన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది.అగస్టు 15 నాటికి వీటిని ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4525 మీ సేవా కేంద్రాలుండగా వీటిలో 3 వేల వరకు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రం లో 12,769 గ్రామ పంచాయితీలు ఉండగా వాటిలో1050 గ్రామాల్లోనే మీ సేవా కేం ద్రాలున్నాయి.ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు,దరఖాస్తుల చెల్లింపులతో సహా 600కుపైగా ప్రైవేట్ కార్యాకలాపాల కోసం గ్రామీణ ప్రాంత నుంచి పట్టణాల్లోని కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యం లో ప్రభుత్వం మహిళలకు మరింత ఆర్దికంగా చేయూత ఇచ్చేందుకు వీటిని మహిళా శక్తి పథకం కింద, మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించింది.
గ్రామ ఐక్య సంఘాల(విలేజ్ ఆర్గనైజేషన్) పేరుతో మహిళా శక్తి మీసే కేంద్రాలను ( ఎమ్మెస్,ఎమ్సెస్సీ) ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు రూ.2.50 లక్షల రుణాన్ని స్త్రీ నిధి ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అందిస్తుంది. ప్రభుత్వ అధికారు పర్యవేక్షణలో పేరు పొం దిన కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింట ర్లు, జిపిఎస్,బయోమెట్రిక్ పరికరాలు, కెమె రా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి.
కేంద్రాలు ప్రారంభమైన అనంతరం ఆయా సంఘాలు రుణాన్ని ప్రతి నెలా తిరిగి చెల్లించాలి. స్త్రీ నిధి స్ధానికంగా ఉన్న గ్రామపంచా యితీ, ప్రభుత్వ పాఠశాల, రేతు వేదిక, అం గన్ వాడీ కేంద్రాల భవనాలు లేదా ఇతర ప్రభుత్వం భవనాలు, వాటి ప్రాంగణాలో మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 10 అడుగులు పొడవు, 10 అడుగుల వెడల్పుతో వసతి ఏర్పాటు చేస్తారు. ఆయా సంఘాల్లో ఇంటర్ పాసైన సభ్యురాళ్ళను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు.
కేంద్రం నిర్వహణ, సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరం మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ ఎంవోయు( అవగాహన ఒప్పందం) చేసుకుంటుంది. జలై నెలాఖరు వరకు ఆపరేటర్లను ఏంపిక, అనంతరం, వారికి నెల రోజులు పాటు శిక్షణ ఇచ్చి మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఆగస్టు 15 నాటికి వాటిని ప్రారభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.






