18 August, 2026 | 1:18 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న పంట దగ్ధం

29-04-2026 09:51 AM

అలంపూర్: ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి  మొక్కజొన్న పంట అగ్నికి కాలీ బూడిదయ్యింది. ఈ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.ఉన్నట్టుండి అకస్మాత్తుగా రాత్రి  బలమైన ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి.దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. బలంగా వీచిన గాలులకు మంటలు ఎగసిపడి  ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మంటలు చెలరేగాయి.సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట కాలీ పోయినట్లు సమచారం.మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చేతి కందిన పంట కాలీ బూడిద కావడంతో రైతులు కన్నీరు మున్నీయ్యారు.