అనుమతి లేకుండా నడుస్తున్న కాకరవాయి శ్రీరామ విద్యాలయం సీజ్
- విద్యాశాఖ దాడి… పాఠశాల మూసివేత
- నిబంధనల ఉల్లంఘనపై చర్యలు
- రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీరామ విద్యాలయంపై విద్యాశాఖ అధికారులు అకస్మికంగా దాడి చేసి పాఠశాలను మూసివేశారు మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన తనిఖీలలో పాఠశాల ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నట్టు వెల్లడైంది దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు తక్షణమే చర్యలు తీసుకుని పాఠశాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్లు ఇతర ముఖ్య రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అనంతరం హ్యాండ్ ఓవర్ ప్రక్రియను పూర్తి చేశారు ఈ ఘటనతో స్థానికంగా చర్చలు జోరందుకున్నాయి అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నడపడం చట్ట విరుద్ధమని అధికారులు హెచ్చరిస్తూ ఇకపై ఇలాంటి అక్రమాలపై తగిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు ఈ తనిఖీలలో విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు






