28 April, 2026 | 3:03 AM

మక్క రైతుకు అరిగోస!

28-04-2026 01:09 AM
  1. కొనుగోళ్లు లేక ఆగమాగం
  2. కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు
  3. పట్టించుకోని అధికారులు
  4. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి 

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా చేపట్టిన మక్కల కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొంది. దీనితో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంటడం, అమ్మకానికి సిద్ధం చేసిన రైతులు మక్కలతో కొనుగో ళ్ల కేంద్రాల వద్ద పడిగాపులు పడడం నిత్య కృత్యంగా మారింది.

గత నాలుగు రోజుల నుండి మార్క్ ఫెడ్ సంస్థ రైతుల నుంచి కొనుగోలుకు సెలెక్ట్ చేసిన మక్కలను కొ నుగోలు చేయడానికి అవసరమైన గన్ని బస్తాల ను కూడా ఇవ్వకపోవడంతో రైతులే సొం తంగా డబ్బులు చెల్లించి బయట కొనుగోలు చేసి కాంటాలు నిర్వహించినప్పటికీ వాటిని గోదాములకు తరలించే పరిస్థితి లేక మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్నల కొను గోళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

జిల్లాలో సాధారణ యాసంగిలో మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం 45 నుండి 60 వేల ఎకరాలు కాగా మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 1.53 లక్షల ఎకరాలకు పెరిగిందని, దీనికి తోడు సాధారణంగా పంట దిగుబడి ఎకరానికి 25 క్వింటాలు గరిష్టంగా వస్తే ఈసారి గరిష్టంగా 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. దీనితో జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా మక్కజొన్నలే కనిపిస్తున్నాయి. 

ప్రైవేటు ట్రేడర్ల వద్ద తగ్గిన ధర

గతంలో ప్రైవేటు ట్రేడర్లు క్వింటాలకు 2000 కుమించి ధర పెడుతుండడంతో రైతులకు కాస్త గిట్టుబాటుగా ఉండటం వల్ల ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రైవేట్ ట్రేడ ర్లు గరిష్టంగా 17 వందల రూ పాయలు ధర పెడుతుండడంతో ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలకు రైతులు వెల్లువలా మొక్కజొన్నలను తెస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో క్వింటాలుకు 2400 రూపాయల చొప్పున చెల్లిస్తుండడంతో ప్రైవేటు ట్రేడర్లకు విక్రయించడానికి అన్నదాతలు అయీష్టత చూపుతు న్నారు. ఫలితంగా ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలకు అంచనాలకు మించి లక్షలాది బస్తా ల మొక్కజొన్నలు వస్తుండడంతో కొనుగోళ్లకు తీవ్ర ఆటంకంగా మారింది. 

కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రైతు లు మక్కజొన్నలను విక్రయానికి తెచ్చి రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. కొనుగోలు చేసిన మక్కలను ఎగుమతి చేయడానికి లారీల కొర త, గన్ని కొరత, కార్మికుల కొరతతో పాటు స్థల భావం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

రెగ్యులర్ మార్కెట్లకు ఇబ్బంది

మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ తో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో రైతులు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడానికి ఇబ్బందిగా మారింది. గత నెల రోజులుగా ఈ రెండు మార్కెట్లలో మార్క్ఫెడ్ సంస్థ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో యార్డు లు పూర్తిగా మొక్కలతో నిండిపోయాయి. దీనితో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ఆటంకంగా మారింది. దీనివల్ల యార్డుల్లో రైతులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడం ఆయా మార్కెట్ పాలక మండల చైర్మన్లకు తలకు మించి న భారంగా మారిందని వాపోతున్నారు. 

అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మహబూబాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజ న్లో సాగుచేసిన మొక్కజొన్న పంట విస్తీర్ణం, దిగుబడిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళికలు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మార్క్ఫె డ్ సంస్థ ద్వారా 21 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రంలో రికార్డు అని, అదనంగా మరికొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాద ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పండించిన పంట ఉత్పత్తులను పూర్తిగా ప్రభు త్వం కొనుగోలు చేయడానికి అవసరమైన చర్య లు తీసుకోవాలని, అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెట్ కమిటీల పా లకమండలి, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

మా వల్ల కావడం లేదు

మొక్కజొన్న కొనుగోలు కేం ద్రాలను కేసముద్రం మార్కె ట్లో ఏర్పాటు చేశారు. మునుపెన్న డూ లేని విధంగా లక్షల బస్తాల మొక్కజొన్నలు విక్రయానికి వస్తున్నాయి. మార్కెట్లో రైతులకు సౌకర్యాలు కల్పించాం. అయితే స్థలం సరిపోకపోవడం, లారీలు, గన్ని కొరత, కార్మికుల ఇబ్బందులు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అంచనాలకు మించి పో వడంతో మావల్ల కావడం లేదు. రైతులు సంయమనం పాటించి కొనుగోళ్ల తీరును పరిశీ లించి క్రమ పద్ధతిలో మార్కెట్కు మొక్కలను తీసుకురావాలి. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొ నుగోళ్లకు ఆటంకంగా మారిం ది. మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల మార్కె ట్ బయట కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ దృష్టికి కూడా తీసుకువెళ్లాం.

 సంజీవరెడ్డి, 

మార్కెట్ చైర్మన్, కేసముద్రం