28 April, 2026 | 3:01 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని వినతి

28-04-2026 01:09 AM

నస్పూర్, ఏప్రిల్ 27 : పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్  బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఏఓ రాజేశ్వర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధు కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని,

ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు చెల్లింలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ఆడెపు అరుణ్ ప్రసాద్, మంచిర్యాల జిల్లా నాయకులు మహమ్మద్ సాజిద్ చోటు, తిరుపతి, నడిపెల్లి నవదీప్, బెల్లం అరుణ్, ముస్తాఫ్ఫా, మెహరన్, దేవి సాయి కృష్ణ , నస్పూర్ శివ పాల్గొన్నారు.