2వేల కోట్ల నష్టం
- ట్రంప్ మీడియా ‘ట్రూత్’ గ్రూప్‌నకు భారీదెబ్బ
- డిజిటల్ కరెన్సీ మార్కెట్లో భారీ పతనం
- క్రిప్టో కరెన్సీ విలువలు పడిపోవడం కూడా కారణం
వాషింగ్టన్, ఆగస్టు 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌న సోల్ మీడియా ట్రూత్‌నకు భారీ నష్టం వచ్చింది. ట్రూత్ సోషల్ సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌నకు రెండో త్రైమాసకంలో 238 మిలియన్ డాలర్లు (దాదాపు 2వేల కోట్లు) నష్టం వాటిల్లింది. సంస్థ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ (టీఎంటీజీ)నకు రెండో త్రైమాసికంలో 238 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 వేల కోట్లు) నష్టం వాటిల్లింది.
కంపెనీ పైలింగ్ ప్రకారం.. జూన్‌తో ముగిసిన ఈ త్రైమాసిక నష్టం.. గత ఏడాది నమోదైన నష్టం కంటే 10రెట్లు ఎక్కువ. సంస్థ ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువైనప్పటికీ.. నష్టం మాత్రం తప్పలేదు. డిజిటల్ కరెన్సీ మార్కెట్లో భారీ పతనం.. క్రిప్టో కరెన్సీ విలువలు డమాల్ కావడం వల్లే నష్టాలు వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఈ నష్టం నేపథ్యంలో భవిష్యత్తులో కొత్త వృద్ధి అవకాశాలను, వాటాదారుల విలువను పెంచే నూతన విధానాలపై దృష్టిపెట్టామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మెక్‌గర్న్ వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్, క్రిప్టో వంటి కార్యక్రమాలను పక్కన పెట్టేసి మళ్లీ తమ దృష్టిని సోషల్ మీడియా వ్యాపారాలపై మళ్లించడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ట్రూత్ మీడియాలో కొత్త ఫీచర్లు తీసుకురావడానికి..
మరింత మంది వినియోగదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ట్రూత్ సోషల్‌లోని ప్రముఖ వినియోగదారుల పోస్టులను ము ందుగానే చూడగలిగేలా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థలకు ముందస్తు యాక్సెస్ ఇచ్చే ట్రూత్ ఏపీఐకు ఇకపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకుంది. ట్రూత్ ఏపీఐ కోసం ట్రంప్ మీడియా నెలకు 60 వేల డాలర్ల నుంచి ఒక లక్షల డాలర్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే 10 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.






