12 August, 2026 | 12:47 AM

చిన్న విమానంలో ట్రంప్

12-08-2026 12:03 AM
  1. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వదిలి.. అదృశ్యం
  2. తుర్కియే నుంచి ‘సీ32ఏ’లో రహస్యంగా బ్రిటన్‌కు
  3. పర్యటన వెనుక మర్మమేంటి?

వాషింగ్టన్, ఆగస్టు 11: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, బెదిరింపుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ దేశానికి చెంది న అగ్రనేతలు రెగ్యులర్ రూట్స్‌లో కాకుండా వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. తాజా గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన భద్రత కోసం కేటాయించిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని కాదని అమెరికా మిలటరీకి చెందిన ఓ చిన్న విమానంలో ప్రయాణించడం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ విస్మయానికి గురిచేసింది.

ఈ పర్యటన వెనుక మర్మమేంటి? అని అంతా చర్చించుకుంటున్నారు. అయితే తుర్కియోలో జరిగిన నాటో సదస్సు తర్వాత ట్రంప్.. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కాకుండా ఈ విమానంలో ప్రయాణించినట్టు అమెరికా మీడి యా కథనాలు వెలువరించింది. అయితే ఈ ఘటన గత నెల 8న జరిగింది. కానీ చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూలై నెలలో తుర్కియో కాపిటల్ సిటీ అంకారాలో నాటో మీటింగ్ జరిగింది.

తనకు ఖతార్ గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బోయింగ్747-8 అంకారాకు ట్రంప్ వెళ్లారు. కానీ ఆ తర్వాత విమానం బెల్లీ నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడే రెడీగా ఉన్న ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్‌ట్రక్కులోకి, ఆ తర్వా త ఆయన్ని సీ32ఏ విమానంలో తుర్కియో నుంచి రహస్యంగా బ్రిటన్ వెళ్లారు.