ఈ వారం క్యూ4 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలివే

29-04-2024 12:43:03 AM

మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి  ఈ వారంలో మొత్తం 211 కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. వీటిలో కోటక్ బ్యాంక్, డీమార్ట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియన్ ఆయిల్, కోల్ ఇండియా, టైటాన్ ఆర్థిక ఫలితాలు ఉన్నాయి.

ఏప్రిల్ 29

అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, యూకో బ్యాంక్, కేపీఐటీ టెక్నాలజీస్, టాటా కెమికల్స్, పీఎన్‌బీ హౌసింగ్, జిల్లెట్ ఇండియా, క్యాన్‌ఫిన్ హోమ్స్, షాపర్స్‌స్టాప్

ఏప్రిల్ 30

ఇండియన్ ఆయిల్, ఆర్‌ఈసీ, అదానీ ఎనర్జీ, హవెల్స్ ఇండియా, అదానీ టోటల్ గ్యాస్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, స్టార్‌హెల్త్, పీ అండ్ జీ

మే 1

అదానీ పవర్, అంబూజా సిమెంట్స్, అదానీ విల్మార్, ఓరియంట్ సిమెంట్, సిగ్నిటిటెక్నాలజీస్,  మంగళం సిమెంట్, పీఎన్‌బీ గిల్ట్స్, జెనోటెక్ ల్యాబ్స్

మే 2

అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, డాబర్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, కఫోర్జ్, అజంతా ఫార్మా, బ్లూస్టార్, బ్లూడార్ట్, రైల్‌టెల్, సియట్, సౌత్ ఇండియన్ బ్యాంక్

మే 3

టైటాన్ కంపెనీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎంఆర్‌ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా,మంగళూరు రిఫైనరీ, టాటా టెక్నాలజీస్, రేమండ్, ఆర్తి డ్రగ్స్, గో ఫ్యాషన్

మే 4

కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏవిన్యూ సూపర్‌మార్ట్స్, ఐడీబీఐ బ్యాంక్, నెరోలాక్, సీడీఎస్‌ఎల్, బిర్లా కార్పొరేషన్

క్యూ4 ఫలితాలు

ఈ వారంలో 200కుపైగా బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీలు వాటి మార్చి త్రైమాసికపు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డాబర్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, టైటాన్, టాటా టెక్నాలజీస్, ఏవిన్యూ సూపర్‌మార్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కెమికల్స్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అంబూజా సిమెంట్స్, అదానీ విల్మార్‌లు వెల్లడించే ఫలితాలు మార్కెట్ దిశను కొంతమేర ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. 

ఆటో సేల్స్

ఏప్రిల్ నెలలో ఆటోమొబైల్స్ అమ్మకాలపై దేశీయ ఇన్వెస్టర్లు దృష్టిపెడతారు. ఇవి మే 1న విడుదలవుతాయి. పాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు రెండంకెల్లో వృద్ధిచెందాయని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే వాణిజ్య వాహన విక్రయా లు, ట్రాక్టర్ల అమ్మకాలు నిరుత్సాహపరుస్తాయన్న అంచనాలు ఉన్నాయి.

నిఫ్టీ కీలకస్థాయి 22,300

సాంకేతికంగా నిఫ్టీ వీక్లీ చార్టుల్లో హైవేవ్ క్యాండిల్‌స్టిక్ ప్యాట్రన్‌ను ప్రదర్శిస్తున్నదని, బుల్స్, బేర్స్‌లో అయోమయ పరిస్థితిని ఇది సూచిస్తున్నదని టెక్నికల్ అనలిస్టులు చెపుతు న్నారు. అయితే నిఫ్టీ 22,300 పాయింట్లపైన కొనసాగితే ట్రెండ్ సానుకూలంగానే ఉంటుందని, ఈ స్థాయిని కోల్పోతే 22,222 పాయింట్ల స్థాయి వద్ద తదుపరి మద్దతు ఉన్నదన్నారు. రానున్న రోజుల్లో ఇండెక్స్ తిరిగి 22,500 పాయింట్ల స్థాయిని చేజిక్కించుకుని, ఆపైన స్థిరపడితే 22,700 శ్రేణి వరకూ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారం నిఫ్టీ 22,300పైన నిలదొక్కుకుంటే, క్రమేపీ 22,750 శ్రేణిని చేరవచ్చని ఆనంద్‌రాఠి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ జిగర్ పటేల్ విశ్లేషించారు. 22,300 పాయింట్ల స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమవుతుందని హెచ్చరించారు. ఈ వారం ప్రారంభంలో 22,530 స్థాయిని అందుకోలేకపోతే 22,400 శ్రేణి తక్షణ మద్దతును అందించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌స్మార్ట్ విశ్లేషకుడు సంతోష్ మీనా అంచనా వేశారు ఈ శ్రేణిని వదులుకుంటే 21,900 స్థాయికి తగ్గవచ్చన్నారు. మరోవైపు మే సిరీస్ గరిష్ఠస్థాయి అయిన 22,620 పాయింట్లను దాటితే వచ్చే కొద్ది వారాల్లో 23,000 పాయింట్ల స్థాయి సాధ్యపడుతుందన్నారు. 

ఆర్థిక గణాంకాలు

దేశంలో తయారీ రంగం ట్రెండ్‌ను తెలిపే ఏప్రిల్ నెల ఫైనల్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డాటా మే 2న వెల్లడవుతుంది. ప్రాధమిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ 59.1 శాతంగా ఉన్నది. మౌలిక రంగాల ఉత్పత్తి డాటా ఏప్రిల్ 30న ప్రకటిస్తారు. ఏప్రిల్ 19తో ముగిసిన పక్షం రోజులకు బ్యాంక్‌ల డిపాజిట్లు, రుణాల వృద్ధి అంకెలు, ఏప్రిల్ 26తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వల వివరాలు మే 3న వెల్లడవుతాయి. అంతర్జాతీయంగా యూఎస్ కార్పొరేట్ల ఫలితాలు, పేరోల్స్ డాటా, నిరుద్యోగం రేటు, పీఎంఐ డాటాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.