13 August, 2026 | 2:52 AM

దేవరయాంజాలులో భారీ అగ్ని ప్రమాదం

13-08-2026 02:02 AM

మేడ్చల్, ఆగస్టు  12 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా తూముకుంట  పరిధిలోని డైరీ క్లాసిక్ ఐస్ క్రీమ్ కోల్ స్టోరేజీలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో వస్తువులన్నీ కాలిపోయాయి. పరిసర ప్రాంతాల్లో  దట్టమైన పొగ వ్యాపించింది. 

అగ్నిమాపక శతకాలు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. దాదాపు ఏడు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకొని  మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గోధుమల యజమానులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని గోదాము యజమానులు ముందస్తుగా గోదాంకు నీళ్లు చల్లుకున్నారు. కూల్ రష్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ  నష్టం జరగకపోవడంతో అందరూ పెంచుకున్నారు.