బార్లను తలపిస్తున్న పర్మిట్ రూమ్‌లు
బ్రాందీ షాపుల్లో విచ్చలవిడిగా సిట్టింగులు
పక్కనే నివాస గృహలున్నా యథేచ్ఛగా నిర్వహణ
పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
పర్మిట్ రూంలలో నిలువు దోపిడీ
మేడ్చల్ అర్బన్ ఆగస్టు 12 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని మద్యం షాపుల్లో ఎర్పాటు చేసిన పర్మిట్ రూంలు బార్లను తలపిస్తున్నాయి.నిబంధనలు గాలికి వదిలేసి పెద్ద పెద్ద రేకుల షేడ్లు వేసి బేంచీలు,బల్లాలు వేసి యదేచ్చగా సిట్టింగులను నడిపిస్తున్నారు. పట్టణంలోని ఆయా వైన్స్ షాపుల వెనుకాల,పక్కన నివాస గృహలు ఉన్న పర్మిట్ రూము లు నడిపిస్తున్నారు.నిర్ణీత కొలతల ప్రకారం ఒక చిన్న గదిలో మాత్రమే పర్మిట్ రూములను నిర్వహించాల్సి ఉంటుంది.
ఇందులో ఎలాంటి బెంచీలు బల్లాలు గాని వేయకుండా నిర్వహించాలి.కేవలం గ్లాసులు,మందు సీసాలు పెట్టుకునేందుకు మాత్రమే వాల్ చెక్కాలు వేయాలి.అలా కాకుండా పరిగి పట్టణంలోని మద్యం దుకాణాల దగ్గర పెద్ద షాపులు ఎర్పాటు చేసి తినుబండారాలు,వాటర్ పాకెట్లు,వాటర్ బాటిళ్లు,పర్మిట్ రూం దగ్గర తాగి పడేసిన ఖాళీ సీసాలు,గ్లాసులు ఎర్పాటు చేసి సిట్టింగులను నిర్వహిస్తున్నారు.ఎక్సెజ్,పోలీస్ శాఖ అధికారులకు నెల నెల మామూళ్ళు ముట్టజేబుతూ బార్లను తలపించేలా పర్మిట్ రూములు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పర్మిట్ రూంలలో నిలువు దోపిడీ
మందుబాబులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించడం స్థానిక ప్రజలకు,మహిళలకు ఇబ్బందులు కలుగకూడదని ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుబందంగా పర్మిట్ రూములకు లైసెన్స్ లను జారీ చేస్తుంది. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు పర్మిట్ రూముల పేరుతో మద్యం షాపుల పక్కనే సిట్టింగులను నడుపుతున్నారు.పర్మిట్ రూముల్లో పదుల సంఖ్యలో టేబుళ్లు,కుర్చీలు సిట్టింగుకు పరిపడ ఎర్పాట్లు చేశారు.నిబంధనలకు విరుద్దంగా పర్మిట్ రూముల్లో ప్రత్యేకంగా కౌంటర్ కూడ ఎర్పాటు చేసుకున్నారు.
పట్టణంలోని అన్ని మద్యం దుకాణాల్లో నిబంధనలను అతిక్రమించి సిట్టింగులను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. పర్మిట్ గదుల్లో లూజ్ గా మద్యం విక్రయిస్తున్న సమయంలో అధిక ధరలు ఉన్న మద్యం లో చీఫ్ లిక్కర్ ను కలిపి అమ్ముతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.అదేవిధంగా పర్మిట్ రూముల్లో అహర పదార్థాలు విక్రయించవద్దనే నిబంధనలను తుంగలో తొక్కి కోందరు చికెట్,మటన్ కూడ విక్రయిస్తున్నారు. పర్మిట్ రూంలో మందు బాబులను విలువ దోపిడీ చేస్తున్నారు. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతేగాక బయట నుంచి వాటర్ బాటిల్, స్టఫ్ తీసుకొని రావడానికి అనుమతించడం లేదు. పరిమిట్లో నిబంధనలు పాటించకున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి..
ఇవి నిబంధనలు..
ప్రతి వైన్స్ షాపుకు (ఎ4)కు ఆనుకోని 100 చదరపు గజాల విస్తీర్ణంలో గదికి ఎక్సెజ్ శాఖ పర్మిట్ రూముగా అనుమతి ఇస్తుంది. ఇది వైన్స్ షాపుకు అనుకోని ఉన్న గదిలో ఎర్పాటు చేయాలి. వైన్స్ షాప లో మద్యం కొనుగోలు చేసిన వారు రోడ్డుపై బహిరంగంగా రోడ్డు పక్కన గాని తాగకుండా గదిలోకి వెళ్లి తాగేందుకు అవకాశం కల్పించేందుకే ప్రభుత్వం పర్మిట్ రూం లైసెన్స్ లో జారీ చేసింది. అలాంటి పర్మిట్ రూం లో ఒక బల్లాపై సోడా,గ్లాసులు, త్రాగునీరు, పల్లీలు, బటానీల వంటి చిన్న చిన్న స్నాక్స్ మాత్రమే అందుబాటులో ఉంచాలి.పర్మిట్ రూం లో కుర్చీలు, బెంచీలు, బల్లాలు తదితర ఎర్పాట్లు ఎవి ఉండకూడదు..






