26-11-2025 05:31:37 PM
హాంకాంగ్: హాంకాంగ్(Hongkong) థాయ్ పొ జిల్లా ఆకాశభర్య్మల్లోని ఓ నివాస సముదాయంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని భవనల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం ధాటికి పొగ దట్టంగా అలుముకోవడంతో చుట్టుప్రక్కల వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.