calender_icon.png 26 November, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ సభ్యులుగా మెరుగు నరేష్ గౌడ్ నియామకం

26-11-2025 05:17:36 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం కమిటీ సభ్యుడుగా మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ పట్టణానికి చెందిన మెరుగు నరేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 12 మంది సభ్యులతో కూడిన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ కమిటీ డిసెంబర్ 10వ తేదీ నుంచి 2026 మార్చి 21 వరకు కొనసాగుతారు. నరేష్ గౌడ్ కీసర శ్రీభవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఆలయ బోర్డు సభ్యుడిగా 2 సార్లు (24 నెలలు) పనిచేశారు. కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యుడిగా నియామకమైన సందర్భంగా నరేష్ గౌడ్ కు ఆయా రాజకీయ పార్టీల నాయకులు, బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు.