calender_icon.png 26 November, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి..

26-11-2025 05:05:35 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు..

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం... విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగా వైభవంగా... కన్నుల పండువగా నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరామరావు దంపతులకు సాయిరి పద్మ మహేందర్ దంపతులు  మెమొంటో అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీశ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు, చైర్మన్ సాయిరి  పద్మ మహేందర్ దంపతుల ఆధ్వర్యం లో  ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవాధ్యక్షులు, గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, యంత్ర ప్రతిష్టాపకులు , ఆధర్పణ వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ శర్మ , ఆలయ పురోహితులు గూడ రమేష్ శర్మ , శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ మారవేణి లచ్చయ్య, ఆలయ చీఫ్ అడ్వైజర్ కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), ముత్యాల రవీందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు , భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి , నరేందర్ రెడ్డి  స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ కుమార్  పలువురు ఉన్నారు, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది, ఈ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.