ఉద్యోగం పేరుతో ఘరానా మోసం
రెండు లక్షలు తీసుకొని ఫేక్ పత్రాలు
నిర్మల్ మే 27 ( విజయక్రాంతి) నిర్మల్ జిల్లాలో కాంట్రాక్ట్ ఏజెన్సీల బాగోతం మరోసారి బయటపడింది.మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెన్సీ తమ వద్ద రూపాయలు రెండు లక్షల చొప్పున వసూలు చేసి నకిలీ ఉద్యోగం నియామక పత్రాలు అందించాలని బాధితులు వాపోయారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ ను వారు వివరాలు వెల్లడించారు. రాథోడ్ వికాస్ శివకృష్ణ అన్నారు. జిల్లా మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని ఓ ప్రైవేటు ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది అన్నారు.
తమకు ఉద్యోగాలు వస్తాయని అక్కడ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షలు చొప్పున అడ్వాన్స్ తీసుకొని ఉద్యోగం వచ్చినట్టు ఇచ్చి మోసం చేశారని బాధితులు వాపోయారు మాకు రాజేందర్ అనే ఏజెంట్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మా కుటుంబానికి హామీ ఇచ్చారన్నారు. ఆఫీస్ సబర్డేంట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయని రూ.2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో మెడికల్ కాలేజీలో ఉద్యోగం వస్తుందన్న ఆశతో, ఏజెంట్ రాజేందర్ కు మోసపోయి రూ .2 లక్షల డబ్బులు ఇచ్చామని పేర్కొన్నారు.
డబ్బులు ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటికి ఎటువంటి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. గట్టిగా అడగడంతో.. మాకు అపాయింట్మెంట్ కాపీలు ఇచ్చారని తెలిపారు.వాటిని తీసుకొని, మెడికల్ కాలేజీకి వెళ్లడంతో ... వారు ఇక్కడ ఎటువంటి ఉద్యోగం లేదని అవి ఫేక్ ఆర్డర్ కాపీలని అక్కడి నుంచి పంపించేశారని తెలియజేశారు. అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపలేదు సమాధానం ఇవ్వలేదన్నారు. ఈ జిల్లాలో అతనికి డబ్బులు ఇచ్చి చాలా మంది మోసపోయారాని ,వారు భయానికి బయటకు రావడం లేదని,వారికి అధికారులు న్యాయం చేయాలని కోరారు.






