15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

9న చలో నిర్మల్ విజయవంతం చేయండి

04-06-2025 07:08 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఆదివాసి నాయక పోడు తెగ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రోజున చలో నిర్మల్ విజయవంతం చేయాలని నాయక పోడు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య అన్నారు. బుధవారం రోజున జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాయక పోడు తెగకు సిరియల్ నంబర్ కేటాయించాలని, నిర్మల్ జిల్లాలో 55000 జనాభా ఉన్న గుర్తింపు లేకపోవడం పట్ల సంక్షేమ పథకాలు, విద్య, ఉద్యోగాలు దూరంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరేందుకే చలో నిర్మల్ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిర్మల్ జిల్లాలో ప్రధానమైన తెగ నాయక పోడు తెగ అధికారులకు తెలియకపోవడం తాము ఎంత వెనుకబడి ఉన్నామో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అర్థం చేసుకోవాలన్నారు. తమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి, జాతర ,సంస్కృతిని సాంప్రదాయా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మా కుల దైవమైన భీమన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి, జాతర ఏర్పాటులకు నిధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని మన ఆదివాసు బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసి అభ్యుదయ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా తుడుందెబ్బ కన్వీనర్ సాకి లక్ష్మణ్,జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకుర్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ లింగన్న, ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కస్తూర్ భూమేష్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మేడిపల్లి రవి, కొప్పుల చిన్నయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.