calender_icon.png 12 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హైవే పనులు వేగవంతం చేయాలని సీఎంకు ఏమ్మెల్యే విజ్ఞప్తి

12-11-2025 05:40:12 PM

నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల పనులకు, బీటీ రోడ్లు, సీ సీ రోడ్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలని వేడుకొలు..

సానుకూలంగా స్పందించిన సీఎం..

చేవెళ్ల (విజయక్రాంతి): హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ, అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నియోజకవర్గంలోని బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య సీఎంను కోరారు. మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో కలిసి మర్యాదపూర్వకంగా అభ్యర్థించారు. 

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. చేవెళ్లలో రహదారి కనెక్టివిటీ బలోపేతం కావడంతో ప్రజలకు, వ్యాపారాలకు కలిగే ప్రయోజనాలను ఎమ్మెల్యే వివరించారు.