9 July, 2026 | 3:37 AM

రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

09-07-2026 01:52 AM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్

ఖమ్మం, జులై 8 (విజయక్రాంతి): చింతకాని మండలం జగన్నాధపురంలో ఈ నెల 10న నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న తో కలిసి ఆయన మాట్లాడారు.

గత నెల 30న మధిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ భారీ వర్షాల కారణంగా వాయిదా పడిందని, అదే రైతు ఆశీర్వాద సభను జూలై 10న మధ్యాహ్నం 2 గంటలకు జగన్నాధపురంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు కూడా పాల్గొంటారని నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

అదే విధంగా  రైతు శ్రేయస్సే లక్ష్యంగా 9 రోజులలో 9000 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమచేసి ప్రజా పాలన గావిస్తున్న ప్రభుత్వం రికార్డు సృష్టించిందని కావున ఉమ్మడి జిల్లా లోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజెండ్ల సాయికుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా ఎస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, తగదితర నాయకులు పాల్గొన్నారు.