11 August, 2026 | 2:54 AM

గీతన్నల చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయండి

11-08-2026 01:03 AM

జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్  

కొండాపూర్, ఆగస్టు 10 (విజయక్రాంతి) : ఈనెల 13వ తేదీ రాష్ట్ర బస్సు యాత్ర సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ వస్తున్న  సందర్భంగా ఈరోజు  కొండాపూర్ లో గీతన్నల చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా  సహాయ కార్యదర్శి రామా గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు గౌడ సోదరులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కల్లు గీత వృత్తి సంక్షేమం కోసం బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలని కోరుతూ కల్లు గీత కార్మికులందరూ వనమహోత్సవంలో ఈత తాటి చెట్ల పెంపకాలుచేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న  మహబూబాబాద్ లోప్రారంభమైన గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్ర  ఈనెల13వ తేదీన  10 గంటలకు సంగారెడ్డికి చేరుతుందని ఆయన అన్నారు.

ఈ బస్సు యాత్ర సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగే గీతన్నాల చైతన్య యాత్ర కుస్వాగతం పలుకుతూ భారీబైక్ ర్యాలీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో  జిల్లాలోని కల్లుగీత కార్మికులు గౌడ సోదరులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణలో  గౌడ సంఘం నాయకులు కృష్ణ గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్, విష్ణు గౌడ్, అనంత్ రాములు గౌడ్, కుమార్ గౌడ్, నర్సింలు గౌడ్, నందు గౌడ్, ఎల్లయ్య గౌడ్, అనంతయ్య గౌడ్, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు